Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lekkaleni Chukalenno Chakkaga Veluguchunda

లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ

Lekkaleni Chukalenno Chakkaga Veluguchunda

Verse
లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ‖ 2x ‖
చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క - దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క‖ 2x ‖
Verse
ప్రభువునందు మృతులే మరి ధన్యులని - విభుని చెంత చేరుటయే గమ్యమని‖ 2x ‖
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క‖ 2x ‖
Verse
దేహమందు నివశించుట వ్యర్ధమని - మోహమంత మరచుట పరమార్ధమని‖ 2x ‖
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క‖ 2x ‖
Verse
పాపలోకమందు బ్రతుకలేమని - ఆ పరమును చే్రుటయే మేలని‖ 2x ‖
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క‖ 2x ‖
Verse
యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని - మృతులనుండి తనను తిరిగి లేపునని‖ 2x ‖
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క‖ 2x ‖

Related Tags

HeavenHopeFuneral