Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lekkimpaga Tharama

లెక్కింపగ తరమా

Lekkimpaga Tharama

Verse
లెక్కింపగ తరమా నీ మేలులు
వివరింపగ తరమా నీ కార్యములు‖ 2x ‖
నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము‖ 2x లెక్కింపగ ‖
Verse
నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి‖ 2x ‖
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి‖ 2x లెక్కింపగ ‖
Verse
నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి‖ 2x ‖
నీ దయయందు మనుష్యుల దయయందు
ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి‖ 2x లెక్కింపగ ‖

Related Tags

PraiseWorshipThanksgiving