Verse
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్‖ 2x ‖
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై‖ 2x లెక్కించలేని ‖
Verse
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును‖ 2x ‖
భూమిలో కనబడునవన్ని‖ 2x ‖
ప్రభువా నిన్నే కీర్తించున్‖ లెక్కించలేని ‖
Verse
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును‖ 2x ‖
భూమిపైనున్నవన్ని‖ 2x ‖
దేవా నిన్నే పొగడును‖ లెక్కించలేని ‖
Verse
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు‖ 2x ‖
ఆకాశామున ఎగురునవన్ని‖ 2x ‖
ప్రభువా నిన్నే కీర్తించున్‖ లెక్కించలేని ‖