Verse
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ
ఇదిగో నుందయించె నీపై‖ లెమ్ము ‖
Verse
జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ
కాంతికి తరలి రాజులు వత్తురు‖ లెమ్ము ‖
Verse
సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ
ర్యము వచ్చు నీ యొద్దకు‖ లెమ్ము ‖
Verse
గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద
క్షేత్రము గొప్పగజేతు‖ లెమ్ము ‖
Verse
నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు
నిన్ను కారణముగ జేతు‖ లెమ్ము ‖
Verse
ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె
ఎంతో బలమగు జనమగును‖ లెమ్ము ‖