Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lemmu Thejarillumu Ani

లెమ్ము తేజరిల్లుము అని

Lemmu Thejarillumu Ani

Verse
లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజ పరచిన నా యేసయ్య‖ 2x ‖
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
నిను వేనోళ్ళ ప్రకటించెద‖ 2x ‖
Verse
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము‖ 2x ‖
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి‖ 2x ‖
ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ‖ లెమ్ము ‖
Verse
శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత‖ 2x ‖
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి‖ 2x ‖
ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
ఇదియే నా ధన్యత‖ లెమ్ము ‖
Verse
తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము‖ 2x ‖
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే‖ 2x ‖
ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము‖ లెమ్ము ‖

Related Tags

PraiseWorshipGrace