Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lemmu Thejarillumu Neeku

లెమ్ము తేజరిల్లుము నీకు

Lemmu Thejarillumu Neeku

Verse
లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది‖ 2x ‖
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె‖ 2x లెమ్ము ‖
Verse
యేసే యీ లోకమునకు
వెలుగై యున్నానని చెప్పెన్‖ 2x ‖
యేసుని నమ్మువారు‖ 2x ‖
వెలుగులో నడుచువారు‖ 2x లెమ్ము ‖
Verse
అంధకార మందుండి
బంధింప బడిన వారిన్‖ 2x ‖
ఆశ్చర్యమైన వెలుగు‖ 2x ‖
నందించి విమోచించెన్‖ 2x లెమ్ము ‖
Verse
దాత ప్రభు యేసుని నమ్మి
నీతిగా నడుచువారు‖ 2x ‖
జాతి భేదములు లేక‖ 2x ‖
జ్యోతుల వలె నుందురు‖ 2x లెమ్ము ‖
Verse
మనుజులు మీ సత్క్రియలను
జూచి బహు సంతోషించి‖ 2x ‖
మనసారా పరమ తండ్రిన్‖ 2x ‖
మహిమ పరచెదరు‖ 2x లెమ్ము ‖
Verse
జనములు నీ వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు‖ 2x ‖
రాజులు నీదు ఉదయ‖ 2x ‖
కాంతికి వచ్చెదరు‖ 2x లెమ్ము ‖

Related Tags

PraiseGloryLight