Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lemmu Thejarillumu Neeku Velugu Vachchi Yunnadhi

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి యున్నది

Lemmu Thejarillumu Neeku Velugu Vachchi Yunnadhi

Verse 1
Reference: నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా Isaiah 60:1
Chorus
లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చి యున్నది
Verse
యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె
Verse
జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు
Verse
సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును
Verse
దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను
Verse
నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్
బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను
Verse
వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును

Related Tags

GloryLightPromiseIsaiah