Chorus
లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ ప్రభుండు బుట్టె
ధరణిలో నేడు-దావీదు పురమున
Verse
అవతార రూపధారుడుగా నవతరించెను-అండజేరియున్నవారి నాదరించెను
పండియుండె పాకలోన పాపగ నేడు పాపముల బాపను‖ లెండి ‖
Verse
ఆహా! దూత దెల్పె గొల్లలకును చల్లని వార్త - ప్రీతితోడ ప్రభుని జూడ బయలుదేరిరి
యాతురతతో మందలను పొలమున విడచి యావేళను వారు‖ లెండి ‖
Verse
ఆహా! తారబుట్టె నాకశమున - ఆదినంబున ఆ తారగాంచి జ్ఞానులంత తరలి వెళ్లిరి
బోళము బంగారములను బాలయేసుకు అర్పించిరి నాడు‖ లెండి ‖