Verse
లేత మొక్కలా తండ్రి సన్నిధిలో
నిత్య మహిమలో ఎదిగావు
లోక పాపములే నీ బుజముపై
కల్వరి సిలువలో ఒదిగావు
Verse
సొగసైననూ లేక సురూపమూ లేక
బలియైతివా నా యేసయ్యా‖ 2x ‖
నీ ప్రేమనే రక్తముగా మార్చితివే
నా కొరకే యేసయ్యా‖ 2x ‖
Verse
మృత్యుంజయుడా పునరుద్ధానుడవై
ఆఖరి శత్రువునే గెలిచావు‖ 2x ‖
పరలోక రాజ్యంలా ఈ భువినంతటిని
నీ మహిమతో నింపావు‖ 2x ‖
Verse
సమాధి సంకెళ్ళయినా మరణపు మళ్ళైన జయించితివా నా యేసయ్యా‖ 2x ‖
నీ ఆత్మతో నను ముద్రించితివే
నీ రాజ్యముకే యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా