Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Loka Rakshakudu Manakorakudhayinchenu

లోక రక్షకుడు మనకొరకుదయించెను

Loka Rakshakudu Manakorakudhayinchenu

Lyricist: Samuel Karmoji
Verse
లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను
మన పాప శాపములన్ని తొలగింపను
ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను …
లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను
Verse
కన్య కుమారుడుగా మనకై పుట్టెను
లోక రాజులందరికి దడ పుట్టించెను
సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను
Verse
దావీదు సుతినిగా మన కొరకొచ్చేను
గొల్యాతులందరు ఇక కూలిపోవును
ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును
Verse
రక్షకుండు ఉదయించెన్! మన పాప శిక్ష తొలగింపఁన్!
తన రాజ్యమున ఇక మనలన్!
శాశ్వతముగా నిలువనిచ్చెన్!
Verse
ఆశ్చర్యములను చేసెన్!
ఆలోచనను ఇచ్చెన్!
బలమును చూపి నిత్యము నిలచి!
సమాధానము నొసఁగెన్…!
Verse
ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు…
అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను …
నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును …

Related Tags

SalvationJesusChristmas