Verse
లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు‖ 2x ‖
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో‖ 2x లోకాన ‖
Verse
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో‖ 2x ‖
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని‖ 2x ‖
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో‖ 2x లోకాన ‖
Verse
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో‖ 2x ‖
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు‖ 2x ‖
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో‖ 2x లోకాన ‖