Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokaana Unnadi Okade Devudu

లోకానా ఉన్నది ఒకడే దేవుడు

Lokaana Unnadi Okade Devudu

Lyricist: Joel Kodali
Verse
లోకానా ఉన్నది ఒకడే దేవుడు
ప్రేమించు పాలించు ఏకైక నాధుడు
మన దేవుడు సజీవుడు
Verse
పిలిస్తే పలికేవాడు జగములనేలేవాడు
సకలం సృజియించినవాడు కునుకడు నిదురపోడు
సర్వోన్నత స్థలములలోన ఘన మహిమలు కలిగినవాడు
స్వయంగ మన దరిచేరి మనకండగ నిలిచేవాడు
చెరలోన నున్నవారికి విడుదల నిచ్చువాడు
క్రుంగినవారిని లేవనెత్తువాడు
నశియించువారిని వెదకి రక్షించువాడు
తనవారి గుండెలలో నివాసం చేయువాడు
Chorus
సజీవుడు మన దేవుడు నరుడై భువి చేరినవాడు
సజీవుడు మన దేవుడు మనకై మరణించినవాడు
సజీవుడు మన దేవుడు మరణం జయించినవాడు
సజీవుడు మన దేవుడు మరల రానున్నవాడు
Verse
యేసే మన విమోచకుడు గొప్ప నిరీక్షణ కర్త
శాంతి సమాధానములు వరముగా నిచ్చువాడు
యేసే మన రక్షణ సంఘం తానే మన ఉన్నత దుర్గం
తన స్నేహితులు అంటు మనలను పిలిచేవాడు
తన రెక్కల క్రింద మనలను దాచువాడు
తన వెచ్చని వడిలో మనకున్నది ఎంతో క్షేమం
లోకాన లేరు యేసయ్యను మించినవారు
యేసే మన దైవం తానే మన అతిశయము‖ పిలిస్తే ‖
యేసే మన ప్రాణాధారం తానే మన జీవాహారం
జీవజలధారలు మనలో ప్రవహింపజేయువాడు
యేసే మన ఘనతకు మూలం తానే ఘనకీర్తికి మార్గం
నీతిమంతులు అంటు మనలను పిలిచేవాడు
తన ప్రాణమే వెలగ మనలను కొన్నవాడు
మనకంత విలువ తన విలువనిచ్చువాడు
యేసయ్యను ఎరిగిన ప్రతిజీవికి నిత్యజీవం
ఆ రాజుని కాదని బ్రతికుండుట ఎవరికి సాధ్యం‖ పిలిస్తే ‖

Related Tags

PraiseWorshipSalvation