Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokam Jeevam Maranambainan Sakalamu Meve Nijam Sthiramuga Nammudilan

లోకం జీవం మరణంబైనన్ సకలము మేవె నిజం స్థిరముగ నమ్ముడిలన్

Lokam Jeevam Maranambainan Sakalamu Meve Nijam Sthiramuga Nammudilan

Intro
సమస్తమును మీవే 1 కొరింథీ Corinthians 3:22
Chorus
లోకం, జీవం, మరణంబైనన్
సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్
Verse
ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను
వాస్తవముగా సమస్తము మీవె - మీరేసుని వారు
Verse
తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో
కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు
Verse
హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు
పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును
Verse
అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము
రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు
Verse
అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును
యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు
Verse
మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు
వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు
Verse
జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా
ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు

Related Tags

FaithSalvationChristian Life