Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokamantata Velugu Prakashinchenu Ye

లోకమంతట వెలుగు ప్రకాశించెను యే

Lokamantata Velugu Prakashinchenu Ye

Lyricist: R Devadasu
Verse 1
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి‖ లో ‖
Verse
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో
నడువక జీవపువెలుగై యుండుడనె యేసు‖ లో ‖
Verse
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ
పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ
పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు‖ లో ‖
Verse
మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక మీరు వెలుగు సంబంధులు
మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురనె యేసుండు‖ లో ‖
Verse
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక
మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగును
ప్రభువు యేసుకు జేయని పాడరే‖ లో ‖

Related Tags

JesusChristmasLight