Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokamanthata Velugu

లోకమంతట వెలుగు

Lokamanthata Velugu

Verse
లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి‖ 2x ‖
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి‖ లోకమంతట ‖
Verse
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక‖ 2x ‖
జీవపువెలుగై యుండుడనె యేసు‖ లోకమంతట ‖
Verse
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె‖ 2x ‖
పిల్లయే దీపమై వెలుగుచుండు‖ లోకమంతట ‖
Verse
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి‖ 2x ‖
వెలుగై యుందురనె యేసుండు‖ లోకమంతట ‖
Verse
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు‖ 2x ‖
ప్రభువు యేసుకు జేయని పాడరే‖ లోకమంతట ‖

Related Tags

JesusChristmasLight