Verse
లోకమునకు నన్ను - దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి - అద్భుత దేవా నా దేవా
ఉప్పుగా జేసితివి
Verse
నరరూపధారి - పరలోక ఉప్పయి
ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి
Verse
యెరికో నీళ్ళ - వలె నా జీవం
మరణచేదై యుండ నీవు - రుచిగా మార్చితివి
Verse
నా రోతహృదయం - నూతన పరచి
పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు
Verse
పరులకు యిలలో - ప్రభు క్రీస్తు రుచిన్
నిరతమునే జూపునట్లు - కుమ్మరించుము నన్ను
Verse
నీ నిత్యజీవం - నీ సంతోషం
నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి
Verse
దీనుడనై నే - బహుదుఃఖపడిన
ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న
Verse
జనులు నన్ను హింసించినపుడు
ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్