Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokamunu Jayinchina Vijayamu Vishwasame Ee Lokamunu Jayinchina Vijayamu Vishwasame

లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే

Lokamunu Jayinchina Vijayamu Vishwasame Ee Lokamunu Jayinchina Vijayamu Vishwasame

Lyricist: Bro Anil Kumar
Chorus
లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే‖ 2x ‖
లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే
Verse
ఆవగింజంత విశ్వాసం - నీలో ఉంటే .... (హే)‖ 2x ‖
కొండలైనా కదులును - సంద్రమైన చీలును
గాలైన అణగి దెయ్యమైనా వదలి - యేసునకే మహిమ తెచ్చును
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే‖ 2x ‖
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... ఏ
Verse
నమ్మిన నీవు దేవుని - మహిమ చూస్తావు ... (హూ)‖ 2x ‖
మృతులను లేపెడి - యేసు రాజే జీవము
మృతమైన లోక జనులను లేప - యేసు వలే సాగి పోవుదాం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే‖ 2x ‖
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే.... హే
Verse
లేని వాటిని ఉన్నట్టు - పిలుచును ప్రభువు..... (హూ )‖ 2x ‖
విశ్వసించి పలుకుదాం - క్రియలను చూపుదాం
జీవవాక్కు పలికి ఆత్మ శక్తి చూపి - గొప్ప గొప్ప పనులు చేయుదాం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే‖ 2x ‖
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
Verse
నమ్ము వానికి సమస్తం - సాధ్యమే ప్రభుతో ..... (హో)‖ 2x ‖
ప్రభువు ఉన్నాడని - ఫలము ఇస్తాడని
నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే‖ 2x ‖
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

Related Tags

FaithJesusVictory