Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokamunu Vidachi

లోకమును విడచి

Lokamunu Vidachi

Verse
లోకమును విడచి వెళ్ళవలెనుగా‖ 2x ‖
సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్‖ లోకమును ‖
Verse
యాత్రికులము ఈ దుష్ట లోకములో
పాడు లోకములో మనకేది లేదు‖ 2x ‖
ఏ విషయమందైన గర్వించలేము‖ 2x ‖
జాగ్రత్తగానే నడచుకొనెదము‖ 2x లోకమును ‖
Verse
మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము‖ 2x ‖
నిష్కళంకులమై శుద్ధులమై‖ 2x ‖
పరిపూర్ణతను చేపట్టుదాము‖ 2x లోకమును ‖
Verse
ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతమో సౌందర్య నగరం‖ 2x ‖
ప్రభువు చెంతకు వెళ్ళెదము‖ 2x ‖
విజయోత్సవముతో ప్రవేశించెదము‖ 2x లోకమును ‖

Related Tags

PilgrimageRepentanceEternity