Verse 1
లోకమును విడచి వెళ్ళవలెనుగా
సర్వమిచ్చటనే విడువా వలెన్‖ 2x ‖
Verse
యాత్రికులము ఈ దుష్టలోకములో
పాడులోకములో మనకేది లేదు
ఏ విషయమందైన గర్వించలేము
జాగ్రత్తగానే నడుచు కొనెదము
Verse
మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము
నిష్కళంకులమై శుద్ధూలమై
పరిపూర్ణతాను చేపట్టుదాము
Verse
ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతోమో సౌంధర్య నగరం
ప్రభువు చెంతాకు వెళ్ళేదాము
విజయోత్సవముతో ప్రవేశించెదము