Verse 1
Reference: నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము. హెబ్రీ Hebrews 13:14
Chorus
లోకమును విడచి వెళ్ళవలెనుగ
సర్వమిచ్చటనే విడువవలెన్
Verse
యాత్రికులము యీ దుష్టలోకములో
పాడులోకములో మనకేది లేదు
యే విషయమందైన గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము
Verse
కష్ట బాధలచే బ్రతుకంత నిండె
కన్నీళ్ళు నిరాశ నిస్పృహల మయము
కరుణా కటాక్షము నమ్మెదము
క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము
Verse
ఎంత వరకు యీ భువి యందుండెదమో
సైతానుతో సదా పోరాటమేగా
శత్రుని తంత్రాల నెరిగితిమి
ధైర్యముతోనే కొనసాగెదము
Verse
గతము నంతటిని మరచిపోయెదము
గురియొద్ద కానందముతో వెళ్ళెదము
మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి
అర్హులమౌదము బహుమానమొంద
Verse
మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదము
నిష్కళంకులమై శుద్ధులమై
పరిపూర్ణతను చేపట్టుదము
Verse
జీవము గల ప్రభు రక్షించె మనల
విమోచించి నూతన జీవమొసగ
కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్
అందుచే మనము సిద్ధపడెదము
Verse
ఆత్మీయ నేత్రాలతో చూచెదము
ఎంత అద్భుతము సౌందర్య నగరం
ప్రభువు చెంతకు వెళ్ళెదము
విజయోత్సవముతో ప్రవేశించెదము