Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Deva Maa Deva Needu Vishvaasyatha Chaala Goppadhi

మా దేవ మా దేవ నీదు విశ్వాస్యత చాల గొప్పది

Maa Deva Maa Deva Needu Vishvaasyatha Chaala Goppadhi

Chorus
మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది
Verse
దయామయుండవు తండ్రివి నీవే
తల్లిని మించిన దాతవు నీవే
మాయా మమతల గాధలనుండి
మమ్ములను రక్షించితివి
Verse
కోడిపిల్లలను కాసెడు పగిది
ఆపదలన్నింటి బాపితివయ్యా
సర్వకాలముల యందున నీకే
చక్కగ సంస్తుతులగు నీకే
Verse
సింహపు పిల్లలు ఆకలి గొనిన
సింహపు బోనులో నను వేసినను
సిగ్గు కలుగకుండగ నను నీవు
గాపాడుచునా వీ యిలలో
Verse
మరణ లోయలదున నేనున్న
తరుణములు నాకు విరోధమైన
చ్రణముల్ పాడెడు విధమున నీవు
నన్నొనార్చుచున్నావుగా
Verse
వ్యాధులు నన్ను బాధించినను
వ్యాకులములు హృదయములో నున్న
వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు
నను బ్రోచుచు నుందువుగా
Verse
నీదు సత్యమాకాశము కంటె
అత్యున్నతముగ స్థాపించబడె
నీదు సత్యమును నీచుడనగు నా
కనులకు ప్రత్యక్షపరచితివి
Verse
పర్వతంబులు తొలగినగాని
పలువిధ కొండలు తత్తరిల్లినను
పావనుడా నీదు వెలలేనియట్టి
కృప నను విడువదు హల్లెలూయ

Related Tags

WorshipThanksgivingFaithfulness