Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Goppa Devaa

మా గొప్ప దేవా

Maa Goppa Devaa

Lyricist: Pavan Kumar
Verse
మా గొప్ప దేవా – మము కరుణించి
అత్యున్నత స్థానములో నను నిలిపావు
యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
వెల కట్టలేను ఆ ప్రేమకు
ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో
నిన్నే కీర్తింతును – నా జీవితమంతా‖ 2x ‖
Verse
నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు‖ 2x ‖
పాపంలో నుండి నను విమోచించుటకు
ఆ ఘోర సిలువలోన మరణించావు
దాస్యములోనుండి పడి ఉన్న నన్ను
నీ కుమారునిగా రక్షించావు‖ మా గొప్ప ‖
Verse
మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో
నే తూలనాడి దూషించింది నిన్నేనేగా‖ 2x ‖
ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
హృదయం నీదే యేసయ్యా
నాలాంటి ఘోరమైన పాపిని కూడా
క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా‖ మా గొప్ప ‖

Related Tags

WorshipGraceRepentance