Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Hrudayamulalo Devuni Premanu Kummarinchithivi

మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి

Maa Hrudayamulalo Devuni Premanu Kummarinchithivi

Lyricist: Joel Kodali
Verse
మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి
మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా
ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము
ఆనందించెదము మేము ఆనందించెదము
నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము
మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము
యేసు యేసు నీ ద్వారనే
మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి
యేసు యేసు నీ వలనే కదా
మేము నీతోడి దేవునికి వారసులమైతిమి‖ మా హృదయములలో ‖
Verse
ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి
కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి
మా అపరాధముల కొరకు అప్పగింపబడి
మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు
మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు
పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి‖ మా హృదయములలో ‖
Verse
శ్రమల కాలములో శోకముల ఘడియలలో
నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము
మేమికను పాపులముగా నుండగానే ప్రభూ
మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి
మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము
ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము‖ మా హృదయములలో ‖

Related Tags

PraiseWorshipThanksgiving