Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Mora Naalakinchumu Mahaaraaja Yesu Prabhuvaa

మా మొర నాలకించుము మహారాజ యేసు ప్రభువా

Maa Mora Naalakinchumu Mahaaraaja Yesu Prabhuvaa

Verse
పల్లవి: మా మొర నాలకించుము - మహారాజ యేసు ప్రభువా
కోపముతో నను జూడకుము - కనికరమున పలుకుము
Verse
నిన్నెట్లు విడనాడెదను - ప్రాణప్రియుడా నా యేసు
సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు
నీ నోట దూషణమాట - ఒకటైనను రాలేదు
Verse
పరలోకమును విడచితివి - పాపులకై ఏతెంచితివి
సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి
ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను
Verse
సమస్త లోకమునకు - నీ రక్తము నిచ్చితివి
మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన
నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి
Verse
జగమంత నీ రాకడను - నిరీక్షించుచుండెను
నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి
నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి
Verse
రక్షకుండా పాపులను - శిక్షించక రక్షించు
నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు
దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ

Related Tags

WorshipDevotionalPrayer