Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Oohalu Puttaka Munupe

మా ఊహలు పుట్టక మునుపే

Maa Oohalu Puttaka Munupe

Verse
మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా‖ 2x ‖
ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా‖ 2x ‖
విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో‖ 2x ‖
పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో‖ 2x మా ఊహలు ‖
Verse
నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా‖ 2x ‖
పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి‖ 2x ‖
అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు‖ మా ఊహలు ‖
Verse
ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని‖ 2x ‖
ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా‖ 2x ‖
ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు‖ మా ఊహలు ‖

Related Tags

PraiseWorshipDevotional