Verse
మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవ‖ 2x ‖
ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా‖ 2x ‖
Verse
విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో‖ 2x ‖
పొందెదమెన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో‖ 2x ‖
Verse
నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా
పలు సమయాల యందు - పలు వరముల నిచ్చితివే
అడుగనేల ప్రభువా - ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు‖ మా ఊహలు ‖
Verse
ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చుమని
నిన్నడిగుచున్నాము - నీ రాజ్యములొ చోటిమ్మని
ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవ
ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడె చాలు‖ మా ఊహలు ‖