Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Prabhuyesu Neevae Maa Sarvamu Mahin Maakepudu Neethoanae Snaehamu

మా ప్రభుయేసు నీవే మా సర్వము మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము

Maa Prabhuyesu Neevae Maa Sarvamu Mahin Maakepudu Neethoanae Snaehamu

Chorus
మా ప్రభుయేసు నీవే మా సర్వము
మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము
Verse
సంతృప్తి నీ మందిరమున గలదు
అందానంద ప్రవాహంబు మెరిసింది
వింతైన జీవపు యూటందు గలదు
యెంతైన మా పూజార్హుండ వీవే
Verse
ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు
మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
సతతంబు మా పూజార్హుండ వీవే
Verse
మా తలపు మాటల్లో మా చూపు నడకలో
మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
యెక్కడైనా మా యేసు సన్నిధిలో
Verse
పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము
పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
పాలించుము ప్రభుయేసు రారాజ
Verse
సోదర ప్రేమ సమాధానంబులతో
సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమాళాలతో
వినయంబున పూజింతుము నిన్ను

Related Tags

WorshipDevotional