Verse
మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా…
మా ప్రియమైన యేసయ్యా‖ 2x మా సర్వానిధి ‖
Verse
మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా మా ప్రియ యేసయ్యా‖ 2x ‖
విరిగి నలిగిన హృదయాలతో‖ 2x ‖
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
నీవే మార్గము – నీవే సత్యము
నీవే జీవము – మా యేసయ్యా‖ 2x ‖
జీవపు దాత శ్రీ యేసునాథ‖ 2x ‖
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
మా స్నేహితుడవు – మా రక్షకుడవు
పరిశుద్ధుడవు – మా యేసయ్యా‖ 2x ‖
పరిశుద్ధమైన నీ నామమునే‖ 2x ‖
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా‖ 2x యేసయ్యా ‖