Verse
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే‖ మాధుర్యమే ‖
Verse
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును‖ మాధుర్యమే ‖
Verse
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు‖ మాధుర్యమే ‖
Verse
నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను‖ మాధుర్యమే ‖
Verse
వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో‖ మాధుర్యమే ‖