Chorus
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే - మహా ఆశ్చర్యమే
మహిమానందమే - మహా ఆశ్చర్యమే
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
Verse
సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు‖ 2x ‖
వారి అందమంతయు -పువ్వువలె
వాడిపోవును - వాడిపోవును‖ మాధుర్యమే ‖
Verse
నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె‖ 2x ‖
దేవుని యందలి భయభక్తులతో
ఉండుటే మేలు - ఉండుటే మేలు‖ మాధుర్యమే ‖
Verse
వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను‖ 2x ‖
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో‖ మాధుర్యమే ‖