Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maadhuryampu Naamamu Modhamichchugaanamu

మాధుర్యంపు నామము మోదమిచ్చుగానము

Maadhuryampu Naamamu Modhamichchugaanamu

Verse
మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసు
సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్
Chorus
మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము
వేదవాక్య సారము - యేసు దివ్యయేసు
Verse
మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్
గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు
Verse
వినుండి గొర్రెపిల్లను - విశ్వాసముంచి యేసున్
ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్
Verse
ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్
శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్
Verse
ఓ యన్నలారా - పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్
ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు
Verse
ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు
Verse
శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును
ప్రియంపు దాసులౌచుచు - రయంబు కొల్వుడేసున్

Related Tags

WorshipGospelJesus