Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maakartha Gatti Dhurgamu Ne Nammu Aayudhambu

మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు

Maakartha Gatti Dhurgamu Ne Nammu Aayudhambu

Lyricist: Martin Luther
Verse
మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు
సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు
ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు
తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.
Verse
మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు
మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు
అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు
మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు
Verse
ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు?
మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు?
ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ?
దీర్పొందె నతఁడు నశించు మాటతోనే.
Verse
వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు.
దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు.
మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్
నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.

Related Tags

ProtectionStrength