Verse
మాకు తోడుగ నీవుంటివి
జీవిత యాత్రలో‖ 2x ‖
మమ్ము విడువని మా దేవా
నిండు మనస్సుతో వెంబడించెదం‖ 2x మాకు ‖
Verse
మాతో కూడా ఉందునంటివి
మారని మా దేవా‖ 2x ‖
పరము చేరు వరకు దేవా
మమ్ము నడిపెదవు‖ 2x మమ్ము విడువని ‖
Verse
శత్రువు మాపై చెలరేగగా
కృంగదీయ జూడగా‖ 2x ‖
యెహోవా నిస్సిగా మాకుండి
విజయమిచ్చితివే‖ 2x మమ్ము విడువని ‖
Verse
కష్టములెన్నెన్నో ఎదురైనా
నిన్నే వెంబడింతుము‖ 2x ‖
మాకు తోడుగా నీవుండగా
మేము భయపడము‖ 2x మమ్ము విడువని ‖