Verse
మానవుడవై సకల నరుల
మానక నా దోషముల
బాపుటకు బలియైతివే యేసు‖ 2x మానవుడవై ‖
బహు ప్రేమ తోడ
Verse
నీదు బలిని నిత్యముగను
నిజముగా ధ్యానించి ప్రేమను
నీదు దివ్య ప్రేమ నొందుటకు‖ 2x మానవుడవై ‖
నియమంబు నిచ్చి
Verse
నీ శరీరము రొట్టె వలెనె
నిజముగా విరువంగబడెనే
నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే‖ 2x మానవుడవై ‖
నా యన్న యేసు
Verse
మంచి యూట మించి దండి
పంచ గాయములలో నుండి
నిత్య జీవపు టూటలు జేసితి‖ 2x మానవుడవై ‖
నీ ప్రేమ నుండి
Verse
నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు
నీదు ప్రేమ బలిలో మనుటకు
నిత్య మాచరించుడంటివి నీ‖ 2x మానవుడవై ‖
నిజ భక్తి తోడ
Verse
ఎంతో ప్రేమతో బలిగానయితివి
యెంతో ప్రేమాచారమైతివి
చింతలును నా పాపములు బాప‖ 2x మానవుడవై ‖
శ్రీ యేసు దేవా
Verse
నిత్య బలియగు నిన్నే నమ్మి
నిన్ను ననుభవించి నెమ్మి
నిన్ను నిముడించుకొని నాలో నీ‖ 2x మానవుడవై ‖
నిజ రూప మొంద
Verse
నేను నీ బలిలోన గలిసి
నేను నీతో గలిసి మెలిసి
నేను నీవలె నుండి జేసితివే‖ 2x మానవుడవై ‖
నా దివ్య యేసు
Verse
నీదు శ్రమలను బలిని నిపుడు
నాదు కనులు చూడ నెపుడు
నాదు పాప భారములు దిగునే‖ 2x మానవుడవై ‖
నా దివ్య యేసు
Verse
నీవు బలియై తిరిగి లేచి
నిత్య తేజోరూపు దాల్చి
నిత్యమును నా బంతి నున్నావే‖ 2x మానవుడవై ‖
నిజ దేవా యేసు
Verse
నీవే నీ చేతులలో నిత్తువు
ఈ నీ బలి విందునకు వత్తువు
నిన్ను నిట జూచితిని నా యేసు‖ 2x మానవుడవై ‖
ఎన్నడును మరువను