Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maanavudavai Sakala Narula

మానవుడవై సకల నరుల

Maanavudavai Sakala Narula

Verse
మానవుడవై సకల నరుల
మానక నా దోషముల
బాపుటకు బలియైతివే యేసు‖ 2x ‖
బహు ప్రేమ తోడ‖ మానవుడవై ‖
Verse
నీదు బలిని నిత్యముగను
నిజముగా ధ్యానించి ప్రేమను
నీదు దివ్య ప్రేమ నొందుటకు‖ 2x ‖
నియమంబు నిచ్చి‖ మానవుడవై ‖
Verse
నీ శరీరము రొట్టె వలెనె
నిజముగా విరువంగబడెనే
నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే‖ 2x ‖
నా యన్న యేసు‖ మానవుడవై ‖
Verse
మంచి యూట మించి దండి
పంచ గాయములలో నుండి
నిత్య జీవపు టూటలు జేసితి‖ 2x ‖
నీ ప్రేమ నుండి‖ మానవుడవై ‖
Verse
నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు
నీదు ప్రేమ బలిలో మనుటకు
నిత్య మాచరించుడంటివి నీ‖ 2x ‖
నిజ భక్తి తోడ‖ మానవుడవై ‖
Verse
ఎంతో ప్రేమతో బలిగానయితివి
యెంతో ప్రేమాచారమైతివి
చింతలును నా పాపములు బాప‖ 2x ‖
శ్రీ యేసు దేవా‖ మానవుడవై ‖
Verse
నిత్య బలియగు నిన్నే నమ్మి
నిన్ను ననుభవించి నెమ్మి
నిన్ను నిముడించుకొని నాలో నీ‖ 2x ‖
నిజ రూప మొంద‖ మానవుడవై ‖
Verse
నేను నీ బలిలోన గలిసి
నేను నీతో గలిసి మెలిసి
నేను నీవలె నుండి జేసితివే‖ 2x ‖
నా దివ్య యేసు‖ మానవుడవై ‖
Verse
నీదు శ్రమలను బలిని నిపుడు
నాదు కనులు చూడ నెపుడు
నాదు పాప భారములు దిగునే‖ 2x ‖
నా దివ్య యేసు‖ మానవుడవై ‖
Verse
నీవు బలియై తిరిగి లేచి
నిత్య తేజోరూపు దాల్చి
నిత్యమును నా బంతి నున్నావే‖ 2x ‖
నిజ దేవా యేసు‖ మానవుడవై ‖
Verse
నీవే నీ చేతులలో నిత్తువు
ఈ నీ బలి విందునకు వత్తువు
నిన్ను నిట జూచితిని నా యేసు‖ 2x ‖
ఎన్నడును మరువను‖ మానవుడవై ‖

Related Tags

SacrificeJesusLoveCommunion