Verse
మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలి
యైతివే యేసూ బహు ప్రేమతోడ‖ మానవుఁడవై ‖
Verse
నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య
ప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి‖ మానవుఁడవై ‖
Verse
నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభ
వించుఁడంటివిగా నిజదేవా యేసూ‖ మానవుఁడవై ‖
Verse
నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దిను
భాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ‖ మానవుఁడవై ‖
Verse
మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి నిత్యజీవపు
టూటలు జేసితి నీ ప్రేమ నుండి‖ మానవుఁడవై ‖
Verse
నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య
మాచరించుఁడంటివి నీ నిజభక్తితోడ‖ మానవుఁడవై ‖
Verse
ఎంతో ప్రేమతో బలిగా నైతివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును
నా పాపములు బాప శ్రీ యేసు దేవా‖ మానవుఁడవై ‖
Verse
నిత్యబలి యగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను
నిముడించుకొని నాలో నీ నిజరూప మొంద‖ మానవుఁడవై ‖
Verse
నేను నీ బలిలోనఁ గలిసి నేను నీతోఁ గలిసి మెలిసి నేను నీవలె
నుండఁ జేసితివే నా దివ్య యేసూ‖ మానవుఁడవై ‖
Verse
నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు
పాపభారములు దిగునే నా దివ్య యేసూ‖ మానవుఁడవై ‖
Verse
నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి
నున్నావే నిజ దేవా యేసూ‖ మానవుఁడవై ‖
Verse
నీవే నీ చేతులతో నిత్తువు ఈ నీ బలివిందునకు వత్తువు నిన్ను నిట
జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను‖ మానవుఁడవై ‖