Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maanavula maelu koraku jnyaaniyaina de

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దే

Maanavula maelu koraku jnyaaniyaina de

Chorus
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా‖ మానవుల ‖
Verse
కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము
దాన మొసఁగెఁ బ్రీతిని‖ మానవుల ‖
Verse
యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము
లెడబాపుమీ‖ మానవుల ‖
Verse
కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను
నడుపుమీ‖ మానవుల ‖
Verse
భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక
వీరి భక్తి మిగులఁ జేయుఁమీ‖ మానవుల ‖

Related Tags

MarriageWedding