Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maanavulandaru Okkatenani

మానవులందరు ఒక్కటేనని

Maanavulandaru Okkatenani

Verse
మానవులందరు ఒక్కటేనని
మదిలో మన దేవుడు ఒక్కడేనని‖ 2x ‖
అందరు అందురు – వీనుల విందుగా‖ 2x ‖
(మరి) లోకాన జరిగేది మార్పుగా‖ 2x మానవులందరు ‖
Verse
క్రీస్తు సిలువకు సాక్షులమందురు
సాక్ష్యములిచ్చినా సాకులు మానరు‖ 2x ‖
ప్రార్ధనకొచ్చినా పాపం మానరు‖ 2x ‖
ప్రభువేల వానిని క్షమియించును
మరి వారేల క్షమియింపబడుదురు‖ మానవులందరు ‖
Verse
మార్పులు చెందినా మాటలు మారవు
మనుషులు కలిసినా మనసులు కలువవు‖ 2x ‖
చేతులు కలిపినా హృదయం కలవదు‖ 2x ‖
పైపైకి వందనంబులనుదురు
మరి వారేల నీతిమంతులవుదురు‖ మానవులందరు ‖

Related Tags

RepentanceHumanityHypocrisy