Verse
మారదయా నీ ప్రేమ
మార్పు రాదయా నీ ప్రేమలో‖ 2x ‖
ఎన్ని మారినా మారని ప్రేమ‖ 2x ‖
యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా‖ 2x మారదయా ‖
Verse
నిరీక్షించుచుంటిని నీ రాకకై
వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు‖ 2x ‖
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు‖ 2x మారదయా ‖
Verse
(నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు
నా శ్రమలలో నాకు నీవే జవాబు‖ 2x ‖
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు‖ 2x మారదయా ‖
Verse
నీ మాటలయందే ఆశ యేసయ్యా
వాగ్ధానములు నాలో నెరవేర్చుమా‖ 2x ‖
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు‖ 2x మారదయా ‖