Chorus
మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి‖ 2x ‖
Verse
పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము
పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము
క్షేమము ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము
Verse
ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి
నినుచేరితి దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము‖ మా ‖
Verse
దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము
దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము‖ మా ‖
Verse
అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో
అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను
వేదన అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము‖ మా ‖
Verse
కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి
వెళ్ళితి కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే
కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు
క్షమియించు బ్రోవుము‖ మా ‖
Verse
నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను
నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను
దీవించెను నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును‖ మా ‖