Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maargamu Choopumu Intiki

మార్గము చూపుము ఇంటికి

Maargamu Choopumu Intiki

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి‖ 2x ‖
Verse
పాప మమతల చేత – పారిపోయిన నాకు
ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు
పంపుము క్షేమము‖ 2x ‖
ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు
పుట్టించె ధైర్యము‖ 2x మార్గము ‖
Verse
ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ
దేహీ నిను చేరితి‖ 2x ‖
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు
దారిని జూపుము‖ 2x మార్గము ‖
Verse
దూర దేశములోన – బాగుందుననుకొనుచు
తప్పితి మార్గము
తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల
తరిమే దారిద్య్రము‖ 2x ‖
దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి
ధన్యుని చేయుము‖ 2x మార్గము ‖
Verse
అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు
ఆకలి బాధలో
అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ
అలవడెను వేదన‖ 2x ‖
అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము‖ 2x మార్గము ‖
Verse
కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు
కోపించి వెళ్ళితి
కూలివానిగనైన – నీ యింట పని చేసి
కనికరమే కోరుదు‖ 2x ‖
కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు
క్షమియించి బ్రోవుము‖ 2x మార్గము ‖
Verse
నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి
నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి
నన్నూ దీవించెను‖ 2x ‖
నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును‖ 2x మార్గము ‖

Related Tags

PrayerRepentance