Verse
మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి‖ 2x ‖
Verse
పాప మమతల చేత
పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము
పశ్చాత్తాప్పమునోంది
తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము‖ 2x ‖
ప్రభు నీదు సిలువ
ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము‖ 2x మార్గము ‖
Verse
దూర దేశములోన
బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను
నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము‖ 2x ‖
దాక్షిణ్య మూర్తి నీ
దయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము‖ 2x మార్గము ‖
Verse
నా తండ్రి నను జూచి
పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి
ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను‖ 2x ‖
నా జీవిత కథయంత
యేసు ప్రేమకు ధరలో సాక్షమై యుందును‖ 2x మార్గము ‖