Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maargamu Neevani

మార్గము నీవని

Maargamu Neevani

Verse
మార్గము నీవని – గమ్యము నీవని‖ 2x ‖
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సుగమమాయెనే జీవ యాత్ర
ప్రాణము నీవని – దేహము నీదని‖ 2x ‖
నమ్మితి గనుక ఓ యేసు నాథా
చైతన్యమొందెనే జీవ యాత్ర
Verse
బాధల బరువులో – నిత్య నిరాశలో
శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా‖ 2x ‖
శాంతము నీవని – స్వస్థత నీవని‖ 2x ‖
నమ్మితి గనుక ఓ యేసు నాథా
ఆనందమాయెనే జీవ యాత్ర‖ మార్గము ‖
Verse
ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా
గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా‖ 2x ‖
ధాత్రము నీవని – స్తోత్రము నీవని‖ 2x ‖
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సంగీతమాయెనే జీవ యాత్ర‖ మార్గము ‖

Related Tags

PraiseWorshipPrayer