Verse 1
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా‖ 2x ‖
నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే‖ 2x ‖
ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ‖ 2x ‖
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ‖ 2x నేను ‖
జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ‖ 2x ‖
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ‖ 2x నేను ‖