Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maaripovaali Ee Lokamanthaa

మారిపోవాలి ఈ లోకమంతా

Maaripovaali Ee Lokamanthaa

Verse
మారిపోవాలి ఈ లోకమంతా
చేరరావాలి ప్రభుయేసు చెంత‖ 2x ‖
మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ‖ 2x ‖
పంచుకోవాలి పరవారితో‖ మారిపోవాలి ‖
Verse
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై‖ 2x ‖
వెలిగించాలి ఈ జగతినంతా‖ 2x ‖
కదలి రావాలి కరుణంత మనలో‖ 2x ‖
కరిగిపోవాలి కఠినాత్ములంతా‖ 2x మారిపోవాలి ‖
Verse
మనము బ్రతకాలి విలువైన బ్రతుకు‖ 2x ‖
బ్రతికించాలి ప్రభుయేసు బోధ‖ 2x ‖
ఆదుకోవాలి నర జాతినంతా‖ 2x ‖
అందించాలి ప్రభు వాక్యమెంతో‖ 2x మారిపోవాలి ‖
Verse
మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ‖ 2x ‖
మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ‖ 2x ‖
వినిపించాలి మన సాక్ష్యమంతా‖ 2x ‖
కదిలించాలి హృదయాలనంతా‖ 2x మారిపోవాలి ‖

Related Tags

GospelEncouragementTransformation