Verse
మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ
కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర
యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా‖ 2x మారిపోయెనే ‖
Verse
సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా
దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా‖ 2x ‖
పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా
విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా
ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా
ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా‖ మారిపోయెనే ‖
Verse
యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా
స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా‖ 2x ‖
యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా
తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా
ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా
ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా‖ మారిపోయెనే ‖