Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maarpuchendavaa Neevu Marpuchendavaa

మార్పుచెందవా నీవు మర్పుచెందవా

Maarpuchendavaa Neevu Marpuchendavaa

Verse
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా‖ 2x ‖
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా‖ 2x ‖
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో‖ 2x ‖
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా‖ 2x మార్పుచెందవా ‖
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున‖ 2x ‖
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు‖ 2x మార్పుచెందవా ‖
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా‖ 2x ‖
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే‖ 2x మార్పుచెందవా ‖

Related Tags

RepentanceSalvationJudgment