Verse
పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుడి మత్తయి Matthew 4:17
Chorus
మారు మనస్సు పొందుము - ప్రభుని రాజ్యము సమీపించెను
Verse
యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను
తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు - తన శౌర్యమునెంతో చాటెదరు
Verse
ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారు
ఆ రాజ్య వాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు
Verse
నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును
ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు
Verse
రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవు
స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు
Verse
అంధకార రాజ్యమునుండి పొందుగా తన రాజ్యంబునకు
ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము