Verse
మాటే చాలయ్యా యేసూ నాకు
నీ మాటలోనే జీవం ఉన్నది‖ 2x ‖
నీ మాట వల్లె జరుగును అద్భుతాలు
నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు‖ 2x ‖
నీ మాటకు సమస్తం సాధ్యమే‖ 2x మాటే ‖
Verse
సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి
సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది‖ 2x ‖
నీ మాటకు శక్తి ఉన్నదయ్యా
నీ మాటకు సమస్తం లోబడును‖ 2x నీ మాట వల్లె ‖
Verse
పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు
దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును‖ 2x ‖
నీ మాటలో స్వస్థత ఉందయ్యా
నీ మాటతోనే విడుదల కలుగును‖ 2x నీ మాట వల్లె ‖
Verse
జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు
నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది‖ 2x ‖
నీ మాటలో జీవం ఉందయ్యా
నీ మాటలే మాకు జీవాహారాము‖ 2x నీ మాట వల్లె ‖