Verse
మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు‖ 2x ‖
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x మాట్లాడే ‖
Verse
నా ఇంటి వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు‖ 2x ‖
నా వ్యాధి బలహీన సమయాలలోన‖ 2x ‖
నాతో ఉండే దేవుడ నీవు‖ 2x యేసయ్యా ‖
Verse
నా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు‖ 2x ‖
అన్నీ ముగించి సీయోనులోన‖ 2x ‖
నాతో ఉండే దేవుడ నీవు‖ 2x యేసయ్యా ‖